అప్పుడే రెండో షెడ్యూల్ పూర్తయిపోయిందట..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ డైరెక్షన్లో ‘సాహో’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ప్రభాస్ కు 19వ చిత్రం. ఇప్పటికే ఈ చిత్రం 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందట. మిగతా భాగం చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్యాపులో ప్రభాస్ .. ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో చేస్తున్న చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నాడు. ప్రభాస్ 20వ చిత్రంగా తెరెక్కుతున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ షూటింగును ఇటీవల మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

ప్రభాస్ తో పాటూ హీరోయిన్ పూజా హెగ్దే పై కొన్ని కీలక సన్నివేశాలను అలాగే పాటలను కూడా చిత్రీకరించారు. శరవేగంగా రెండవ షెడ్యూల్ కూడా పూర్తయ్యిందని దర్శకుడు రాధాకృష్ణ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. 1970 కాలంనాటి ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతోంది. పూర్వం .. ప్రస్తుతం అంటూ రెండు పట్టాల పై ఈ ప్రేమకథ పరిగెడుతుంది. ఈ కారణంగానే ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల వెంకటేష్ కూతురి పెళ్ళి రిసెప్షన్ లో ప్రభాస్ ఫొటో చూస్తుంటే ఆయన బాగా బరువు తగ్గినట్టుగా స్పష్టమవుతుంది. ఈ చిత్రం 2020 లో సమ్మర్ కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

Share.