జనాలకి నచ్చినోళ్ళకే ఓట్లేస్తారు..!

ప్రముఖ దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణ మురళి రూపొందిస్తున్న ‘ముఖ్యమంత్రి గారు.. మీరు మాట ఇచ్చారు’ అనే సినిమాను విడుదలను నిలిపేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి లేఖ రావడంతో తాజాగా తన ఇంట్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు పోసాని కృష్ణమురళి. ఎన్నికల కమీషన్ నుండీ లేఖ రావడం పై ఫైర్ అయ్యారు.ఈ ప్రెస్ మీట్లో పోసాని మాట్లాడుతూ.. “అసలు ఈ సినిమాలో నేను ఏం చూపించానో.. ఏం చెప్పానో తెలియకుండా సినిమాను ఆపేయాలని ఎలా లేఖ రాస్తారు. నా సినిమా ఆపేయాలని ఎవడెవడెడో లెటర్‌లు రాస్తుంటాడు. ఎలక్షన్ కమీషన్ వాళ్ళు అన్నింటికీ స్పందిస్తారా? అసలు నేను సినిమా గురించి మీడియాకే చెప్పలేదు. ఈ సినిమాకి సంబంధించి ఒక్క క్లిప్పింగ్ కూడా టీవిలో వేయలేదు. ఒక్క సీన్ కూడా ఇంకా ఎవరూ చూడలేదు. సెన్సార్ నిబంధనలకు లోబడే నా సినిమా తీశా. ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటే సినిమాలు ఓటర్లను ప్రభావితం చేస్తుంది? నైతికత లేదు అంటున్నారు.

నేనేమైనా వ్యభిచార గృహం పెట్టానా? నిజంగా సినిమా ప్రభావితం చేస్తుంది అనుకుంటే.. టీవీల ముందు కూర్చుని పార్టీల గురించి మాట్లాడుతున్నారు అది ప్రభావితం చేయదా? నేను మంచి వాళ్లకి ఓటు వేయమన్నాను .. అంతేకానీ పలానా పార్టీకి ఓటేయమని చెప్పలేదు. మేనిఫేస్టోలో పెట్టిన వాటిని అమలు చేయాలని చెప్పా. ఇది ఎవర్ని ప్రభావితం చేస్తుంది అంటే.. ఎవడు దొంగో.. ఎవడు లఫూట్.. వాడిని మాత్రమే ప్రభావితం చేస్తుంది. ఇది మంచోళ్ళను ప్రభావితం చేయదు.

నువ్వు మంచి పనులు చేయి. నువ్వు మంచి పనులు చేయవు.. లంగా పనులు చేస్తావ్.. నిన్ను ప్రభావితం చేస్తుందా? ఎవడుచేయమన్నాడు అడ్డమైన పనులు.. నువ్వు దేశ ప్రధానిని రోజూ తిడుతున్నావ్.. నీకు ఎన్నికల కోడ్ వర్తించదా? నేను చెప్పింది నిజమైతే ప్రభావితం చేస్తుంది.. అబద్ధం అయితే ప్రభావితం చేయదు. ప్రజలు ప్రభావితం అవుతారంటే పొరపాటు.పవన్ కళ్యాణ్ ఏం చేసాడని పాపం ఆయన్ని కూడా ఆడవాళ్ళతో తిట్టించావ్. ఎన్టీఆర్ ని చంపేశావ్ నీకు జగన్ ని చంపడం ఓ లెక్కా..?పవన్ కళ్యాణ్ ఏం చేసాడని పాపం ఆయన్ని అన్యాయంగా ఆడవాళ్ళతో తిట్టించావ్… ? అయినా జనాలేమీ అమాయకులేం కాదు…! అయినా వ్యక్తిగత అభిప్రాయం వేరు.. సినిమా వేరు. నాకు వ్యక్తిగతంగా జగన్ అంటే ఇష్టం.. జగన్‌కి ఓటు వేస్తా.. జనానికి ఎవరు ఇష్టమైతే వాళ్ళకే ఓట్లేస్తారు. ” అంటూ పోసాని… చంద్రబాబు పై మండిపడ్డారు.

Share.