అందుకే త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు?

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ అయితే ఫిక్స్ చేయలేదు కానీ పూజా హెగ్దే, నివేదా పెత్తురాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా తమన్ సంగీతమందిస్తున్నాడు. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ ‘గీత ఆర్ట్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్ 30 ఇయర్స్ పృథ్విని తప్పించారన్న టాక్ నడుస్తుంది. ఎన్నికల సమయంలో వైసిపి తరఫున ప్రచారం చేసిన పృథ్వి ‘జనసేన’ పై అలాగే పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను.. పవన్ స్నేహితుడు త్రివిక్రమ్ ఈ చిత్రం డైరెక్టర్ కావడంతో పృథ్విని తప్పించాడని ప్రచారం జరిగింది.

అయితే ఈ వార్తలో ఎటువంటి వాస్తవం లేదని తెలుస్తుంది. పోసాని కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ముఖ్యంగా పృథ్వి, పోసాని కాంబినేషన్ లో కీలకమైన సీన్లు ఉండబోతున్నాయట. అయితే పోసాని ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో కొంత కాలం విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారట. ఈ కారణంతో అప్పటికే షూట్ చేసిన కాంబో సీన్లు వేరే ఆర్టిస్టులతో ప్లాన్ చేశారట. అయితే ఇందుకు మరోసారి పృథ్వి డేట్స్ అడిగారట. కానీ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో పృథ్వి డేట్స్ ఇవ్వలేనని చెప్పాడట. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో వీరిద్దరి స్థానంలో కొత్త ఆర్టిస్టులతో రీ షూట్ చేస్తున్నారని సమాచారం. అంతేకాని మెగా ఫ్యామిలీ తో వివాదాలు కారణం కాదని స్పష్టమవుతుంది.

Share.