రెమ్యూనరేషన్ నచ్చకపోవడంతో సినిమా నుంచి అవుట్

మూడు భారీ డిజాస్టర్ల అనంతరం తన నాలుగో సినిమాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్న అఖిల్ కి ఇప్పటివరకూ ఆ సినిమాలో హీరోయిన్ ఫైనల్ అవ్వలేదు. మధ్యలో కైరా, రష్మికల పేర్లు వినిపించినప్పటికీ.. ఏదీ ఫైనల్ అవ్వలేదు. చివరికి.. అన్నయ్య నాగచైతన్య సరసన “ఒక లైలా కోసం”లో నటించి టాలీవుడ్ కి పరిచయమైన పూజా హెగ్డే కావాలని పట్టుబట్టాడట. నిజానికి మీడియం బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి పూజా హెగ్డే లాంటి హీరోయిన్ ను సైన్ చేసే అవకాశం లేకపోయినప్పటికీ.. అఖిల్ అభీష్టం మేరకు అల్లు అరవింద్ ఒకే చేశాడట.

pooja-hegde-out-from-akhils-movie1

అయితే.. పూజా హెగ్డే మరీ ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని, ఆ సినిమా బడ్జెట్ కి, పూజా రెమ్యూనరేషన్ కి సింక్ అవ్వకపోవడంతో ఆమె సినిమా నుండి తప్పుకొందని తెలుస్తోంది. ఆమె స్థానంలో ఇన్స్టాగ్రామ్ హాట్ ప్రాపర్టీ అయినా కెటికా శర్మను హీరోయిన్ గా ఫైనల్ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పూరీ ఆకాష్ సరసన “రోమాంటిక్” సినిమాలో నటిస్తున్న కెటికా శర్మ.. అఖిల్ సినిమా సైన్ చేసే అవకాశాలున్నాయి. మరి అఖిల్ బాబు ఫైనల్ డెసిషన్ ఏమిటో.

Share.