ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన సర్కార్ డైరెక్టర్!

తమిళ టాప్ డైరెక్టర్ ఏ.ఆర్. మురగదాస్ తీసిన సర్కార్ సినిమా పైన చెలరేగుతున్న వివాదం కారణంగా ఈ రోజు హై కోర్ట్ ని ఆశ్రయించారు. అయితే నిన్న రాత్రి మురగదాస్ ఇంటికి పోలీసులు వెళ్లారని సర్కార్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సర్కార్ సినిమా పైన వస్తున్న వివాదం కారణంగా తనని పోలీసులు అరెస్ట్ చేయకుండా మురగదాస్ ముందస్తు బెయిల్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈ సినిమా పైన తమిళనాట అంతటా కూడా వాడి వేడి చర్చలే జరుగుతున్నాయి.

విజయ్, కీర్తి సురేష్ జంటగా మురగదాస్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన సర్కార్ సినిమా ఇటీవలే విడుదల కాగా ఇప్పుడు సినిమాలో మా మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను, ఆమె ప్రవేశ పెట్టిన పథకాలను కించపరిచే విధంగా సీన్లు ఉన్నాయంటూ అన్నాడీఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం పైన సన్ పిక్చర్స్ సంస్థ, అన్నాడీఎంకే నేతలతో చర్చలు జరిపి అభ్యంతరకరమైన సీన్లని తొలగించడానికి ఒప్పుకుంది. ఇక మురగదాస్ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఈరోజు సాయంత్రం విచారణ చేపట్టనుంది.

Share.