ఏపీ పోలీటిక్స్ గురించి జోస్యం చెబుతున్న బండ్ల గణేష్

ఆంధ్రప్రదేశ్ లో 2019 సార్వత్రిక ఎన్నికల హడావుడి ముగిసింది. ప్రస్తుతం అందరూ ఎలక్షన్ రిజల్ట్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈలోపు ఎక్స్ పెక్టేషన్స్ అని సర్వే అనీ రకరకాల రిజల్ట్స్ ను బయటకు వదులుతున్నారు. ఎవరి సర్వే వారిది.. చంద్రబాబు మళ్ళీ గెలుస్తాడు అని ఒకరు అంటే.. ఈసారి చక్రం తిప్పేది జగన్ అని మరొకరు అంటారు. కానీ.. ఇప్పటివరకూ జనసేన గురించి మాత్రం ఎవరూ మాట్లాడలేదు. అయితే.. జనసేన కార్యకర్తల్లో మరియు అభిమానుల్లో ఉత్సాహం నింపడానికి నడుం బిగించాడు బండ్ల గణేష్.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఇటీవల ఓ టీవీ చానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన బండ్ల గణేష్.. ఈ ఎన్నికల్లో కర్ణాటక తరహాలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని జోస్యం చెప్పాడు. ఎలాగూ బండ్ల చెప్పిన విషయాల్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు కానీ.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం మస్త్ ఖుష్ అవుతున్నారు. పొరపాటున బండ్ల జోస్యం ఫలిస్తే మాత్రం మనోడి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది.

Share.