పవన్ కళ్యాణ్ కోపం వెనుక ఉన్న అసలు కథను పట్టించుకోని చానల్స్!

“జనసేన రివ్యూ మీటింగ్ లో అభిమాని మీద కోప్పడని పవన్ కళ్యాణ్” అని నిన్నట్నుంచి పోలోమని వస్తున్న వార్తల్ని చూసే ఉంటాం. కానీ.. పవన్ కళ్యాణ్ కోప్పడడానికి కారణం ఏంటనే విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. పైగా.. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు అనర్హుడు అని తొక్కలో స్టేట్ మెంట్లు మాత్రం ఇచ్చేస్తున్నారు.

కానీ.. నిన్న జరిగిన రివ్యూ మీటింగ్ లో ఏమైందంటే.. ఒక జనసేన కార్యకర్త పార్టీని ఎలా నడపాలి అనే విషయం మీద పవన్ కళ్యాణ్ కు సూచనలిస్తున్న సమయంలో.. పవన్ కళ్యాణ్ అతడ్ని “నువ్వు ఓటు ఎవరికి వేశావ్?” అని అడగగా.. అతడు నిర్భయంగా “జగన్ కి ఓటు వేశాను” అని చెప్పాడు. దానికి సమాధానంగా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు. దానికి జనాలు పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడడం, పవన్ కళ్యాణ్ అసమర్ధుడు అని స్టేట్ మెంట్స్ ఇవ్వడం అనేది ఏమాత్రం సరైన విషయం కాదు.

Share.