22 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ హీరోయిన్

దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, హీరో సమంత సోదరి అయిన సుప్రియ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ తో కలిసి వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ చిత్రంలో హీరోయిన్ గా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు. తెర వెనుక కీలక బాధ్యతలు చేపట్టారు. “అన్నపూర్ణ స్టూడియోస్‌’ బ్యానర్‌లో వస్తున్న సినిమాలకు నిర్మాతగా సుప్రియ వ్యవహరించారు. మళ్ళీ ఇప్పుడు తేరా ముందుకు రాబోతున్నారు. అంటే 22 ఏళ్ళ తర్వాత మళ్లీ తెరపైకి రానున్నారు.

అడవి శేష్, శోభిత హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న “గూఢచారి” సినిమాలో సుప్రియ నటిస్తున్నారు. ఏజెంట్‌ పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ రోల్ పవర్ ఫుల్ గా ఉంటుందని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. యువ దర్శకుడు శశికాంత్‌ టిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అడవి శేషే కథ అందించారు. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకం పై అభిషేక్‌ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రేపు రిలీజ్ కానుంది. ఇందులో సుప్రియ కూడా కనిపిస్తారని తెలిసింది.

Share.