‘మహర్షి’ కథ అక్కడే మలుపు తిరుగుతుందట..!

మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’. మహేష్ 25 వ చిత్రంగా రూపొందిన ‘మహర్షి’ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసాడు. ఈ చిత్రం సమ్మర్ వచ్చే ఏకైక పెద్ద చిత్రం కావడంతో.. దీని పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అంచనాలైతే ఉన్నాయి కానీ.. ఈ చిత్రానికి నెగెటివిటీ బాగా ఎక్కువయ్యింది. టీజర్ ఓకే అనిపించినా పాటలు మాత్రం నిరాశపరిచాయి. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవి శ్రీ ప్రసాద్ పై మహేష్ అభిమానులు మండిపడుతున్నారు. ఒక్క పాట కూడా వినసొంపుగా లేదని… అసలు ఇదేం మ్యూజిక్ అని కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో మహేష్ బాబు మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. స్టూడెంట్ గా, బిజినెస్ మేన్ గా, రైతుగా కనిపించబోతున్నాడు. అయితే ఈ చిత్రంలో పాశర్లపూడి బ్లో అవుట్ సంఘటనను కూడా చూపించబోతున్నారట. కథ మలుపు తిరగడానికి కూడా అదే కీలకమని తెలుస్తుంది. 1995 కృష్ణా గోదావరి బేసిన్ కు సంబంధించిన గ్యాస్ పైప్ లైన్.. వల్ల తూర్పు గోదావరి జిల్లాలోని పాశర్లపూడి గ్రామం పేలిపోయి గ్యాస్ లీకయ్యింది. భారతదేశంలోనే అతిపెద్ద బ్లో అవుట్ ఇదే. ఈ సంఘటనలో ఎవ్వరూ మృతి చెందకపోయినా పాశర్లపూడి చుట్టుపక్కల ఉన్న 65 గ్రామాలు పొగతోనూ.. బ్లో అవుట్ నుండీ వచ్చే బూడిదతోనూ కప్పబడ్డాయి. ఇంచుమించు 1500 మందిని తమ ఇళ్ళనుండి ఖాళీ చేయించేశారు. ఇప్పుడు ‘మహర్షి’ చిత్రంలో ఈ సంఘటన ను చూపిస్తారని తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ ను చాలా సీక్రెట్ గా ఉంచారట. ఇక ‘మహర్షి’ చిత్రం మే 9 న విడుదల కాబోతుంది.

Share.