మాస్ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్న పందెం కోడి 2 ట్రైలర్!

తెలుగు, తమిళ భాషల్లో అభిమానులు కలిగి ఉన్న హీరో విశాల్. అతని సినీ కెరీర్ లో పందెం కోడి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 2005 లో వచ్చిన ఈ మూవీ రెండు భాషల్లోనూ సంచలన విజయం సాధించింది. ఆ సినిమాకి సీక్వెల్ గా రూపుదిద్దుకున్నమూవీ పందెం కోడి 2. ఈ మూవీ ట్రైలర్ నేడు రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది. “తిరునాళ్లలో పులి వేషం వేయచ్చు.. కానీ పులి ముందే వేషం వెయ్యకూడదు” అంటూ విశాల్ చెప్పే డైలాగ్ ఆదరిపోతోంది. ఇదే మరిన్ని డైలాగ్స్ ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించేలా ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాలతో పాటు కీర్తి సురేష్ తో రొమాంటిక్ స్టోరీ ఉన్నట్టు స్పష్టమవుతోంది.

పలు సినిమాల్లో విశాల్ కి జోడీగా నటించి మెప్పించిన వరలక్ష్మి ఈ చిత్రంలో నెగటివ్ రోల్ పోషించింది. తనదైన స్టైల్లో నటించి విశాల్ తో సమానంగా మార్కులు అందుకోబోతున్నట్లు ఈ వీడియో తెలిపింది. ఎన్ లింగుస్వామి తెరకెక్కించిన ఈ మూవీకి యువన్ శంకర్ రాజా హుషారైన సంగీతాన్ని అందించారు. నేపథ్య సంగీతం కూడా అదిరిపోనుంది. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై జయంతి లాల్, అక్షయ్ లతో కలిసి విశాల్ నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 18 న రిలీజ్ కానుంది.

Share.