సినిమావాళ్ళు కాలి సమయంలో ఏం చేస్తారో తెలుసా

ప్రతి సగటు మనిషి రోజంతా ఆఫీసులో పనులు, ఇంటి సమస్యలు, భార్యాపిల్లల బాధ్యతలతో అలసిసోలసిపోయి.. తాను సాంత్వన పొందడం కోసం థియేటర్ కి వెళ్ళో, టీవీలోనో లేక ల్యాప్ టాప్ లోనో సినిమాలు చూస్తుంటాడు. వేరే వృత్తుల్లో ఉన్నవారికంటే సినిమాలు టైమ్ పాస్. అదే నిరంతరం సినిమాల్లో నటిస్తూ లేదా సినిమాలకు వర్క్ చేసే మన టాలీవుడ్ హీరోహీరోయిన్స్ అండ్ టెక్నీషియన్స్ కి బోర్ కొడితే ఏం చేస్తారో తెలుసా..!!

పవన్ కళ్యాణ్Pawan Kalyanపవన్ కళ్యాణ్ అసలు సినిమాలే చూడడన్న విషయం ఆయన అభిమానులందరికీ తెలిసిన విషయమే. అయితే.. ఆయనకు అసలు బోర్ కొట్టదట. అందుకు కారణం ఆయన ఎప్పుడూ పుస్తకాలు చదవడమో లేక మరీ ఫ్రీగా ఉంటే తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి స్వయంగా మట్టి తవ్వి పాదులు వేయడం, మట్టి సర్ధడమ్ లాంటివి చేస్తుంటాడు.

మహేష్ బాబుMahesh babuఅందరూ జగపతిబాబుని ఫ్యామిలీ హీరో అంటారు కానీ.. మహేష్ పర్సనల్ లైఫ్ చూస్తే అర్జెంటుగా ఆ బిరుదు మహేష్ కి ఇచ్చేస్తారు. ఏమాత్రం ఖాళీ దొరికినా ఇదివరకు పుస్తకాలు చదువుకుంటూ కూర్చుండిపోతే మహేష్ బాబు.. ఇప్పుడు మాత్రం తన ముద్దుల తనయుడు గౌతమ్ లేక తనయ సీతారతో మాట్లాడుతూ వాళ్ళ స్కూల్ విశేషాల గురించి అడిగి తెలుసుకొంటాడట. ఇక వాళ్ళకి హాలీడేస్ వస్తే వాళ్ళతో కలిసి ఫారిన్ కంట్రీస్ లో విహరిస్తూ తెగ ఎంజాయ్ చేస్తాడు మన మహేష్ బాబు.

ప్రభాస్Prabhasఅసలు మన అమరేంద్ర బాహుబలికి బోర్ కొట్టదట. అందుకు కారణం ఎల్లప్పుడూ తన స్నేహితులకు దగ్గరగా ఉండడమే. తన డిజైనర్ మొదలుకొని.. కొందరు ప్రొడ్యూసర్స్, హీరోస్ అందరూ ప్రభాస్ కి క్లోజ్ ఫ్రెండ్సే. అందుకే అస్సలు బోర్ ఫీలవ్వడట ప్రభాస్. అందుకే కదా అందరూ ప్రభాస్ ని ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకొనేది.

నందమూరి బాలకృష్ణBalakrishnaఏదో ఒకరిద్దరు ఫ్యాన్స్ ను కొట్టాడని బాలయ్యను కోపిష్టి అనుకొంటారు కానీ.. నిజానికి బాలయ్య చిన్నపిల్లాడిలాంటివాడు. ఆయనకు మేన్షన్ హౌస్ మందంటే చాలా ఇష్టమని అందరికీ తెలిసిందే. అయితే ఆయనేమీ రెగ్యులర్ గా తాగడు. ఆయనకు బోర్ కొడితే.. తన చిన్నప్పటి స్నేహితులు, సన్నిహితులకు ఫోన్ చేసి మాట్లాడుతుంటాడట. లేదంటే.. తన ఇంట్లో పని చేసే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని తాను చేయగల సాయం చేస్తుంటాడట.

నాగార్జునNagarjunaమన ఎవర్ గ్రీన్ మన్మధుడు నాగార్జునకు ఎప్పుడో గానీ బోర్ కొట్టదట. అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలు, తన సినిమా స్టోరీ సిట్టింగ్స్, అన్నపూర్ణ స్కూల్ ఆఫ్ యాక్టింగ్ వంటి ఇన్స్టిట్యూట్ నిర్వహణలో యమ బిజీగా ఉండే నాగార్జునకు ఫ్రీ టైమ్ చాలా రేర్ గా దొరుకుతుందట. అలా బోర్ కొట్టిన సమయంలో ఆయన తన తండ్రి నాగేశ్వర్రావు నటించిన క్లాసిక్ మూవీస్ ను ప్రయివేట్ థియేటర్ లో ప్రొజెక్షన్ వేయించుకొని చూస్తాడట.

వెంకటేష్Venkateshచాలా రెగ్యులర్ గా ఇతర భాషా చిత్రాలను చూసే వెంకటేష్.. బాగా బోర్ కొడితే ధ్యానం చేస్తాడట. అలాగే.. విపరీతమైన క్రికెట్ అభిమాని అయిన వెంకటేష్ యూట్యూబ్ లో తనకు బాగా ఇష్టమైన మ్యాచ్ ఇన్నింగ్స్ ను అప్పుడప్పుడు చూస్తుంటాడట.

బ్రహ్మానందంBrahmanandam500లకు పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ఆయన తాను నటించిన సినిమాలే కాదు అసలు సినిమాలే చూడరట. ఎందుకలా అని అడిగితే “ఆడంతేనండి చూడబుద్ది కాదు” అంటూ సింపుల్ గా సమాధానం చెప్పే బ్రహ్మానందం తనకు బోర్ కొడితే మట్టితో దేవుడి విగ్రహాలు చేస్తుంటారు. అవి కూడా ఆషామాషీగా కాదు.. ఒక ప్రపంచస్తాయి కళాకారుడు రూపొందించిన స్థాయిలో బ్రహ్మానందం మట్టి బొమ్మలకు ప్రాణం పోస్తుంటాడు.

అనుష్క శెట్టిAnushka Shettyఅనుష్కకు బోర్ కొడితే మహా అయితే ఏం చేస్తుంది తనకు ఇష్టమైన యోగా చేస్తుంది అనుకొంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే.. అమ్మడికి యోగాతోపాటు పెట్ యానిమల్స్ తో గడపడం చాలా ఇష్టమట. అందుకే కాస్త ఫ్రీ టైమ్ దొరికితేనో లేక బోర్ కొడితేనో హ్యాపీగా తన కుక్కపిల్లలతో ఆడుకుంటుందట.

Share.