సేఫ్ గేమ్లో ‘సైరా’.. ప్రభాస్ కు పెద్ద గండమే..!

తెలుగు సినిమా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద విజువల్ ఫీస్ట్ దక్కబోతోంది. ఇప్పటి వరకూ మన టాలీవుడ్ సినిమాలకి అంత దమ్ము ఉందా ప్రశ్నించిన వారికి ‘బాహుబలి’ చిత్రం పెద్ద పంచ్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక ఆ సినిమా ఇన్సిపిరేషన్ తో ఇప్పుడు భారీ బడ్జెట్ తో.. అదే రకమైన పాన్ ఇండియన్ కంటెంట్ తో సినిమాలు రాబోతున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో ముందు ఉంది ‘సాహో’ చిత్రం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగష్టు 30 న విడుదల కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని 10,000 ల స్క్రీన్ లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి 350 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందిందని ప్రభాస్ తెలిపాడు.

sye-raa-vs-saaho

ఇక ఈ చిత్రం విడుదలైన 32 రోజులకి మెగాస్టార్ చిరంజీవి నటించిన 151 వ చిత్రం ‘సైరా’ రాబోతుంది. ఈ చిత్రానికి కూడా 300 కోట్ల పైనే బడ్జెట్ అయ్యిందని సమాచారం. ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని కూడా మల్టీ లాంగ్వేజస్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం లో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ , నాయన తార వంటి పెద్ద స్టార్లు నటిస్తున్నారు కాబట్టి ఈ చిత్రం సేఫ్ అని ఫిక్సయిపోవచ్చు. కానీ ‘సాహో’ పరిస్థితి అలా కాదు ప్రభాస్ ను మినహాయిస్తే ఒక్క శ్రద్దా కపూర్ వలనే బాలీవుడ్లో భారీ క్రేజ్ ఏర్పడింది. మరి ఈ రెండు చిత్రాలు ఎలాంటి ఫలితాన్నిస్తాయో తెలుసుకోవాలి అనే అంటే మరికొన్నాళ్ళు వేచి చూడక తప్పదు.

Share.