తప్పదు.. ‘ఆర్.ఆర్.ఆర్’ కు సల్మాన్ అవసరం చాలా ఉంది మరి!

మెగాపవర్ స్టార్ రాంచరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతీ ఒక్క హీరోతోనూ ఎంతో స్నేహంగా మెలుగుతాడు. ఒక్క టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముకులతో కూడా చరణ్ మంచి ర్యాపొ మెయింటైన్ చేస్తుంటాడు. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ ఖాన్‌ తో చరణ్ స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చరణ్‌ ‘జంజీర్‌’ రీమేక్‌ తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నప్పుడు సల్మాన్‌ చాలా హెల్ప్ చేశాడు. ఇందుకు బదులుగా సల్మాన్ ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’ చిత్రం తెలుగులో డబ్ అవుతున్నప్పుడు సల్మాన్‌ పాత్రకు చరణ్‌ డబ్బింగ్‌ చెప్పి ఆ రుణం తీర్చుకున్నాడు.

ఇప్పటికీ వారి మధ్య స్నేహం అలాగే కొనసాగుతుంది. ఇప్పుడు మరోసారి సల్మాన్ కు సాయం చేయడానికి చరణ్ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. సల్మాన్‌ఖాన్‌ నటించిన తాజా చిత్రం ‘భారత్‌’ హిందీతో పాటు తెలుగులో కూడా ఏక కాలంలో విడుదల కానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని డబ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్‌ పాత్ర కు మరోసారి చరణ్‌ డబ్బింగ్ చెప్పబోతున్నాడట. మరి ‘ఆర్.ఆర్.ఆర్’ బాలీవుడ్ ప్రచారం కోసం సల్మాన్ సాయం తీసుకోవాలి కాబట్టి చరణ్ ఇలా మరోసారి సల్మాన్ కి సాయం చేస్తున్నాడని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Share.