అల్లు అర్జున్ కి సమస్యగా మారిన మలయాళీ భామ!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఇప్పుడు ఒక్క హిట్ కావాలి. అలాంటి.. ఇలాంటి హిట్ కాదు.. సరైన హిట్ కావాలి. సరైనోడు లాంటి కలెక్షన్లు తెచ్చే సినిమా కావాలి. అందుకే చాలా జాగ్రత్తగా విక్రమ్ కె కుమార్ కథని ఎంపిక చేసుకున్నారు. తనకి నచ్చినట్టుగా.. ఇమేజ్ కి సూట్ అయ్యేట్టుగా.. స్క్రిప్ట్ ని రాయించుకున్నారు. ఫైనల్ గా కథకి అనుగుణంగా లుక్.. బాడీ ల్యాంగ్వేజ్ మార్చుకునే పనిలో పడ్డారు. విక్రమ్ కుమార్ మాత్రం కాస్టింగ్ సెలక్షన్ చేస్తున్నారు. ముందుగా హీరోయిన్ గా నిత్యా మీనన్ ని ఎంపిక చేసారంట. అతను డైరక్ట్ చేసిన “ఇష్క్”, “24 ” సినిమాల్లో నిత్యా నటించింది. అవి సూపర్ హిట్ అయ్యాయి.

సెంటిమెంట్ పరంగా నిత్యపై డైరక్టర్ కి మంచి అభిప్రాయం ఉంది. ఇక పాత్రకు తగ్గ నటిస్తుందని నమ్మకం ఉంది. అందుకే బన్నీని అడక్కుండానే ఆమెను విక్రమ్ ఫైనల్ చేసారంట. అది తెలిసి బన్నీ తెగ ఫీలయిపోతున్నట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. “సన్నాఫ్ సత్యమూర్తి”లో నిత్య అల్లు అర్జున్ తో కలిసి నటించింది. ఈ జోడీకి మంచి మార్కులు పడలేదు. పైగా ఇప్పుడు నిత్యా మీనన్ కమర్షియల్ సినిమా హీరోయిన్ స్థాయి దాటిపోయింది. భారీగా బరువు పెరిగింది. అందుకే తెగ భయపడిపోతున్నారు. దీంతో విక్రమ్ కుమార్ ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని… ప్రధాన హీరోయిన్ గా అందాల సుందరిని తీసుకుంటానని బన్నీకి నచ్చచెప్పే పనిలో పడ్డారని సమాచారం.

Share.