పబ్లిసిటీ పిచ్చ పరాకాష్టకి చేరితే..!

ఈమధ్యకాలంలో పబ్లిసిటీ కోసం జనాలు పడుతున్న పాట్లు, చేస్తున్న పిచ్చి చేష్టలు చూస్తూనే ఉన్నాం. కానీ.. ఈమధ్యకాలంలో ఒక వ్యక్తి వ్యూహాత్మకంగా హైలైట్ అయిన విధానం చూస్తే ఎవ్వరైనా ముక్కున వేలేసుకోకమానరు. టీయార్పీ రేట్స్ కోసం ఎగబడే చానల్స్ కూడా సదరు సెల్ఫ్ డిక్లేర్డ్ సెలబ్రిటీ వెంటపడడంతో మామూలు రచ్చ జరగలేదు. సభ్య సమాజం సైతం అసహ్యించుకొనే స్థాయిలో జరిగిన ఈ టీవీ చానల్ ప్రోగ్రామ్స్ యూట్యూబ్ లో మాత్రం ట్రెండ్ అయ్యాయి. అయితే.. ఆ దరిద్రపుగొట్టు పబ్లిసిటీని తన ఎదుగుదలగా భావించిన సదరు సోకాల్డ్ సెల్ఫ్ డిక్లేర్డ్ సెలబ్రిటీ ఎలా ఫీల్ అయ్యేవాడు అనే కాన్సెప్ట్ తో రూపొందించబడిన ఈ వీడియో చూస్తే నవ్వుకోవడమేమో తెలియదు కానీ.. కనీసం ఆలోచిస్తారు.

Share.