టీజర్ కే మొత్తం చెప్పేస్తే.. ఇంక థియేటర్లో ఏం చూడాలి?

తెలుగు లేడీ సూపర్ స్టార్ సమంత ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం “ఓ బేబీ”. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో లక్ష్మీ ప్రత్యేక పాత్ర పోషిస్తుండగా.. నాగశౌర్య మరో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ను ఇవాళ విడుదల చేశారు. 70 ఏళ్ల పాత్రధారి లక్ష్మీ.. 25 ఏళ్ల సమంతగా మారితే ఎలా ఉంటుంది అనేది సినిమా కాన్సెప్ట్ అనే విషయం ఆల్రెడీ తెలిసిందే. అదే కాన్సెప్ట్ ను ఇంకాస్త డీటెయిల్డ్ గా ఎక్స్ ప్లేన్ చేశారు ఈ టీజర్ తో.

oh-baby-movie-teaser-review1

oh-baby-movie-teaser-review2

అంతా బాగానే ఉంది కానీ.. సినిమాలోని కీలకమైన అంశాలన్నీ టీజర్ లోనే చూపించేయడం అనేది ఎంతవరకూ కరెక్ట్ అనేది దర్శకురాలు నందినిరెడ్డికే తెలియాలి. అన్నీ పాత్రలను టీజర్ లోనే చూపించేసింది. ఇక సినిమాలో జగపతిబాబు యాక్ట్ చేశాడనే విషయం కూడా ఆయన వాయిస్ కారణంగా రివీల్ అయిపోయింది. మహా అయితే.. ఎమోషనల్ సీన్స్ తప్పితే పెద్దగా ఎంగేజ్ చేసే ట్విస్ట్స్ గట్రా ఏమీ ఉండవు అని ఆడియన్స్ ని ముందే ప్రిపేర్ చేయడం కోసం నందిని రెడ్డి ఇలా చేసిందా లేక వేరే ఏదైనా ఆలోచన ఉందా అనేది తెలియాల్సి ఉంది. టీజర్ మాత్రం ఫన్నీగా బాగానే ఉంది.

Share.