ఫస్ట్ పార్ట్ రిజల్ట్ చూసి మొత్తం మార్చినట్లున్నారుగా

ఫిబ్రవరి 22న విడుదలవుతున్న “ఎన్టీఆర్ మహానాయకుడు” ట్రైలర్ ను ఇవాళ విడుదల చేశారు. ఫస్ట్ పార్ట్ లో జరిగిన తప్పులు సెకండ్ పార్ట్ లో దొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు క్రిష్. ట్రైలర్ ప్రారంభంలోనే ఇందిరా గాంధీ మన ఎన్టీఆర్ హోర్డింగ్ చూసి కృష్ణుడు అనుకోని దండం పెట్టే సీన్ తో మొదలెట్టాడు క్రిష్. ఇక ట్రైలర్ మొత్తం రాజకీయాల్లోకి ప్రవేశించాక ఎన్టీఆర్ ఒక సాధారణ వ్యక్తిగా ఇలా మెలిగేవారు, జనాల్లో ఎలా కలిసిపోయారు అనేది చూపించాడు క్రిష్.

ntr-mahanayakudu-movie-trailer-review1

అలాగే.. ఎన్నికల్లో గెలిచినా కూడా రాజకీయ చదరంగంలో ఎన్టీఆర్ ఎలా బలిపశువయ్యాడు అనేది క్రిష్ తన కథాంశంగా చూపించాడు. ముఖ్యంగా.. నాదెండ్ల భాస్కర్ ను ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసి పెద్ద విలన్ గా చూపించారు. చంద్రబాబునాయుడ్ని ఎన్టీఆర్ కు సపోర్ట్ చేసిన వ్యక్తిగా చూపించారు.

ntr-mahanayakudu-movie-trailer-review2

ఇవన్నీ పక్కన పెడితే.. జనవరిలో రెండు భాగాలకు కలిపి కంబైన్డ్ గా విడుదల చేసిన మొదటి ట్రైలర్ తో పోల్చి చూస్తే.. ఈ కొత్త ట్రైలర్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదనే చెప్పాలి. కాకపోతే.. రాజకీయపరంగా మాత్రం ఈ చిత్రం భారీస్థాయిలో చర్చలకు దారి తీసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా నాదెండ్ల ఈ ట్రైలర్ చూసి ఇమ్మీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టేలా ఉన్నాడు. మరి ఈ సినిమా రిజల్ట్ ఎమువుతుందో తెలియాలంటే ఫిబ్రవరి 22 వరకు వెయిట్ చేయాల్సిందే.

Share.