న్యూ లుక్ కోసం కష్టపడుతున్న ఎన్టీఆర్!

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన  జై లవ కుశ సినిమా ఈనెల 21 న రిలీజ్ కానుంది. ఇందులో మూడు క్యారెక్టర్స్ లో మూడు రకాలుగా కనిపించనున్నారు.  జై, లవ, కుశ పాత్రలు ఎలా ఉంటాయో టీజర్స్, ట్రైలర్ లో చూపించారు. ఈ మూడు క్యారెక్టర్స్ అభిమానులకు తెగనచ్చేశాయి. వీటికోసం తారక్ బాగా కష్టపడ్డారని స్పష్టంగా తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తారక్ ఓ కుటుంబ కథా చిత్రం చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్తగా కనిపించనున్నట్లు తెలిసింది.  బరువు తగ్గి, చాలా స్లిమ్ గా కనిపించాలని త్రివిక్రమ్ చెప్పడంతో.. అందుకు తగ్గట్టు మారిపోవాలని ఎన్టీఆర్ డైట్ ప్లాన్ సిద్ధం చేశారు. జై లవకుశ పనులు పూర్తి కావడంతో వైద్యుల సలహా మేరకు ఆహరం తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు మేకోవర్ పైన కూడా ద్రుష్టి పెట్టినట్లు తెలిసింది. త్రివిక్రమ్ ఈ సినిమా ద్వారా నందమూరి అభిమానులకు మంచి ట్రీట్ ఇవ్వనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.