జై లవ కుశలో తారక్ నటించే రోల్స్ ఇవే

రామోజీ ఫిలిం సిటీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవ కుశ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో తారక్ మూడు పాత్రల్లో విశ్వరూపం చూపించనున్నారు. అందులో ఒకటి లవ కుమార్ పాత్ర. ఇది సాఫ్ట్ హీరో పాత్ర. ఇతను బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తుంటాడు. ఈ క్యారక్టర్ గురించి ఇది వరకే రివీల్ అయింది. రెండో రోల్ పేరు జై.. నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ ఇది. డబ్బులు తీసుకుని సెటిల్ మెంట్స్ చేస్తుంటాడు. ఇక మూడో పాత్ర కుశ. సినిమాలో ఇతనిది ఇంట్రెస్టింగ్ రోల్. నటనే శ్వాసగా బతుకుతుంటాడు. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా వేషాలు వేస్తుంటాడు.

మూడు విభిన్నమైన నేపథ్యం కలిగిన హీరోల మధ్య యాక్షన్, డ్రామా ప్రేక్షకులను అలరిస్తుందని సమాచారం. అంతేకాదు చివరికి వీరు ముగ్గురు కలిసి విలన్ ని ఎదిరించడాన్ని బాబీ డిఫరెంట్ గా ప్లాన్ చేసారని తెలిసింది. ఆ విలన్ పాత్రలో కన్నడ వివాదాస్పద నటుడు దునియా విజయ నటిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో 55 కోట్ల బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్లుగా రాశీ ఖన్నా, నివేత థామస్ ఫిక్స్ అయ్యారు. హంసా నందిని ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.