రామారావుకు హాలీవుడ్ బ్యూటీని సెట్ చేస్తున్న రాజమౌళి

రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని వార్తలు వస్తున్న తరుణంలో ఎన్టీఆర్ సరసన కూడా బాలీవుడ్ హీరోయిన్ ఫిక్స్ అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ.. రాజమౌళి మాత్రం ఎన్టీఆర్ కోసం భారీగానే ప్లాన్ చేశాడని తెలుస్తోంది. రామ్ చరణ్ కోసం బాలీవుడ్ భామను సెట్ చేసిన రాజమౌళి.. ఎన్టీఆర్ కోసం ఏకంగా హాలీవుడ్ భామను ఫైనల్ చేస్తున్నాడని తెలుస్తోంది. రామ్ చరణ్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటించనుండగా.. ఎన్టీఆర్ పాత్ర ఏమిటనే విషయమ్ళో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. దాంతో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఆలోచిస్తున్నారు.

కాకపోతే.. ఈ చిత్రంలో ఎన్టీఆర్ బ్రిటీష్ సోల్జర్ గా కనిపిస్తున్నాడనే టాక్ మాత్రం కాస్త గట్టిగానే వినిపిస్తోంది. అందుకే బ్రిటిష్ వనితను ఎన్టీఆర్ సరసన కథానాయికగా ఎంపిక చేయనున్నాడట. అమీ జాక్సన్ తరహాలో ఎవరైనా ఫారిన్ లేడీని తీసుకోవాలనుకున్నారు. కానీ.. రాజమౌళి పర్ఫెక్షన్ కోసం హాలీవుడ్ లో పని చేస్తున్న నటీమణే కావాలని అడగడంతో హాలీవుడ్ నుంచి లిస్ట్ వచ్చిందట. మరి రాజమౌళి ఎవర్ని ఫైనల్ చేస్తాడనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే.. ఇటీవల లీకైనా ఈ సినిమా షూటింగ్ ఫోటోలు సినిమా మీద అంచనాలు పెంచాయే తప్ప సినిమాకి పెద్ద లాస్ అయితే ఏమీ లేదు.

Share.