కుటుంబంతో కలిసి యూరప్ టూర్ ప్లాన్ చేసిన ఎన్టీఆర్!

బాబీ దర్శకత్వంలో తారక్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన జై లవకుశ రికార్డులను తిరగరాసింది. 150 కోట్ల కలక్షన్స్ రాబట్టి ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఈ మైలు రాయి చేరుకున్న మొదట చిత్రంగా నిలిచింది. చిత్ర బృందంలో ఆనందం నింపింది. ఈ సినిమా కోసం, బిగ్ బాస్ షో కోసం గత మూడు నెలలుగా ఎన్టీఆర్ కష్టపడ్డారు. కుటుంబానికి దూరంగా గడిపారు. ఇప్పుడు వీలు కుదిరింది కాబట్టి వారి కోసం సమయం కేటాయించడానికి సిద్ధమయ్యారు. భార్య, కొడుకుతో కలిసి విదేశీ టూర్ కి పయనమయ్యారు. ఈనెల 20 న యూరప్ వెళ్లనున్నారు. అక్కడ అందమైన ప్రదేశాలను చుట్టి రానున్నారు.

దాదాపు రెండు నెలలపాటు ఈ టూర్ ఉంటుందని సమాచారం. తిరిగి వచ్చిన తర్వాత  త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్న సినిమా పనుల్లో ఎంటర్ కానున్నారు. అప్పటికే పవన్ కళ్యాణ్ సినిమా కొలిక్కి వచ్చి ఉంటుంది. జనవరిలో పవన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ సినిమాని త్రివిక్రమ్ పట్టాలెక్కించనున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధా కృష్ణ నిర్మించనున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

Share.