గ్యాప్ లేకుండా దూసుకొస్తున్న తారక్!

టాలీవుడ్ లో యంగ్ టైగర్ మ్యానియాకి ఫిదా అయిపోతున్నారు అందరూ…వయసు పెరిగే కొద్దీ అనుభవం వస్తుంది అంటారు కదా…ఇప్పుడు తారక్ చేస్తుంది అదే… ఆమధ్య కాస్త ఫ్లాప్స్ తో వెనుక పడ్డ తారక్…తార జువ్వలాగా తిరిగివచ్చి వరుస హిట్స్ తో దూసుకొచ్చాడు…హ్యాట్రిక్ హిట్స్ కొట్టడం మాత్రమే కాకుండా…ఇండస్ట్రీ హిట్స్ ను సైతం మన ఇండస్ట్రీకి అందించాడు మన యువ హీరో…ఇదిలా ఉంటే ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో లవకుశ సినిమా చేస్తున్న తారక్ ఈ సినిమాను ఎంచుకునే క్రమంలో ఎలాంటి గ్యాప్ తీసుకున్నాడో మీకండరికీ తెలిసిందే…అయితే అదే క్రమంలో మళ్ళీ అదే మిస్టేక్ ను రిపీట్ చెయ్యకూడదు అన్న ఆలోచనలో ఉన్న తారక్ ఆ పద్దతిలో పక్కా ప్లాన్ చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు…జై లవకుశ తరువాత….అసలైతే మన కొరటాల తో ఒక సినిమా చెయ్యాల్సి ఉండడం, డేట్స్ ప్రాబ్లమ్ రావడంతో కొరటాల చెర్రీతో సినిమా చేయనున్నాడు…

ఇక అదే క్రమంలో…తారక్ కూడా జైలవకుశ సినిమా తర్వాత త్రివిక్రంతో సినిమా చేసే చాన్సస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి…అదే క్రమంలో ఈసారి మాత్రం మన తారక్ ఏమాత్రం గ్యాప్ తీసుకోడని తన వ్యవహారం చూస్తే అర్ధం అవుతుంది…ఈ కధ అంతా పక్కన పెట్టి మరో కధలోకి వెళితే….ఈ సారి తారక్ తో సినిమా తీసేందుకు దర్శకుల లిస్ట్ కూడా భారీగా  పెరిగిపోతుంది. జై లవకుశ తర్వాత తారక్ ఎవరితో సినిమా చేస్తాడో అనం క్లారిటీ ఇంకా క్ల్యారిఫై కానప్పటికీ…. మరో పక్క ఈమధ్యనే సుకుమార్ కూడా ఎన్.టి.ఆర్ కు ఓ కథ వినిపించాడని తెలుస్తుంది…సుకుమార్ అభిమానులతో చేసిన చిట్ చాట్ లో మాట్లాడుతూ….ఈ విషయాన్ని బయట పెట్టాడు…తారక్ తో ఇప్పటికే ఓ స్టోరీ డిస్కస్ చేశానని తప్పకుండా తనతో మరో సినిమా చేస్తానని తెలిపాడు సుకుమార్. ఇక ఈ లెక్కన చూసుకుంటే కొరటాల, త్రివిక్రమ్, రాజమౌళి, సుకుమార్…అందరు బడా దర్శకులతో ఎన్టీఆర్ సినిమా షురూ చేస్తూ తన కరియర్ ను పూర్తిగా మలుచుకుంటున్నాడు…అదీ అసలు మ్యాటర్.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.