తెలుగు బిగ్ బాస్ షో ని జోష్ తో ప్రారంభించిన ఎన్టీఆర్!

తెలుగు ప్రజలు ఆదివారం రాత్రి టీవీలకు అతుక్కుపోయారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లి తెర ఎంట్రీ ని చూసేందుకు ఉత్సాహం చూపించారు. నందమూరి అభిమానులు కొంత ఆందోళనతో షో కోసం ఎదురుచూసారు. సినిమాల్లో అదరగొట్టే అతను హోస్ట్ గా ఎలా షో ని నడిపిస్తారని ఆలోచనలో ఉన్నారు. అనుమానాలన్నిటినీ తొలి ఎపిసోడ్ లో తారక్ పటాపంచలు చేశారు. నిన్న రాత్రి 9 గంటలకు స్టార్ మా ఛానల్లో బిగ్ బాస్ (తెలుగు) తొలి సీజన్ మొదలయింది. దీనికి ఎన్టీఆర్ డ్యాన్స్ తో ఎంట్రీ ఇచ్చారు. జోష్ తో షోని ప్రారంభించారు. అంతేకాదు కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరిని  ఆత్మీయ పలకరింపుతో ఆహ్వానించారు.

నటీమణులు అర్చన, ముమైత్ ఖాన్, హరి తేజ, జ్యోతి, నటులు శివ బాలాజీ, ప్రిన్స్, ఆదర్శ్, సమీర్, సంపూర్ణేష్ బాబు, సింగర్స్ కల్పన, మధుప్రియ, వీజే కత్తి కార్తీక, సినీ క్రిటిక్ కత్తి మహేష్, హాస్యనటుడు ధన్ రాజ్ లను హౌస్ లోకి పంపించి తాళం వేశారు. వీరందరితో ఎన్టీఆర్ మాట్లాడే విధానం అందరికీ చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా లేడీ పార్టిసిపెంట్స్ ని అమ్మ అంటూ పిలుస్తూ మహిళలపై గౌరవాన్ని చాటుకున్నారు. ఈ షో డెబ్భై రోజులపాటు సాగనుంది. ప్రతి వారం ఎన్టీఆర్ హౌస్ కి వచ్చి పార్టిసిపెంట్స్ తో మాట్లాడనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.