మళ్ళీ మారిన రిలీజ్ డేట్, కన్ఫర్మ్ చేసిన విద్యాబాలన్

ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం మహాశివరాత్రి సందర్భంగా మార్చి 1న విడుదలవుతున్నట్లు ఇటీవల వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ తరహా వార్తలు చాలా వచ్చాయి అందుకు కారణం ఫిబ్రవరి 8న సినిమాను పోస్ట్ పోన్ చేశాక ఇప్పటివరకూ అఫీషియల్ గా మరో విడుదల తేదీని ప్రకటించకపోవడమే. సినిమా షూటింగ్ కూడా ఇంకా పూర్తవ్వకపోవడం, త్వరలోనే ఆంధ్రాలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పుడప్పుడే సినిమా మొదలవుతుందన్నా నమ్మకం లేకుండాపోయింది జనాలకి.

అయితే.. అభిమానులు టెన్షన్ పడుతున్న విషయాన్ని గ్రహించాడో ఏమో కానీ, చిత్ర కథానాయకి అయిన బసవతారకం పాత్రధారి విద్యాబాలన్ ఇవాళ ఉదయం చాలా సీరియస్ గా స్క్రిప్ట్ రాసుకుంటున్న క్రిష్ ఫోటో పెట్టి.. మహానాయకుడు ఫిబ్రవరి 22న విడుదలవుతుంది అని పోస్ట్ చేసింది. దాంతో సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందన్నమాట అని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కథానాయకి కన్ఫర్మ్ చేసింది సరే.. ప్రొడక్షన్ టీం కూడా కన్ఫర్మ్ చేస్తే జనాలు సంతోషిస్తారు.

Share.