ఎన్టీఆర్ ఎంట్రీతో … దాని లాభాలు పెరుగుతాయా..?

జూ.ఎన్టీఆర్… ఎంత టాలెంటెడ్ యాక్టరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటనలో, డ్యాన్స్, డైలాగ్స్,ఫైట్స్, ఎమోషన్… ఇలా ఏది చేయమన్నా సరే సింగల్ టేక్ లో ఫినిష్ చేయడంలో తారక్ సిద్ధహస్తుడు. అభిమానులందరూ ‘ఆల్ రౌండర్’ అని పిలుచుకునే తారక్… ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ పక్కన సినిమాలు చేస్తూనే మరో పక్క బ్రాండ్ అంబాసిడర్ కూడా రాణిస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్ ఓ ప్రముఖ సంస్థకు డీల్ కుదుర్చుకున్నాడట. ఈ డీల్ తో ఎన్టీఆర్ సౌత్ మొత్తాన్ని ఊపెయ్యనున్నాడని తెలుస్తుంది…!

సినిమాలతో పాటూ వాణిజ్య ప్రకటనలలో కూడా దూసుకుపోతున్న వారి జాబితాలో మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. మహేష్ తరువాత ఎన్టీఆర్ కూడా కొన్ని యాడ్స్ లో నటిస్తూ రోజూ టీవీల్లో తన ఫాన్స్ ను ఖుషి చేస్తున్నాడు. ఇందులో భాగంగా ప్రముఖ సంస్థ అయిన ‘పార్లే ఆగ్రో’ తో ఎన్టీఆర్ ఒక డీల్ కి సైన్ చేసాడట…దీంతో టోటల్ సౌత్ ఇండియా మొత్తంగా ఈ సంస్థ తయారు చేస్తున్న ‘యాప్పి ఫిజ్’ ను ఎన్టీఆర్ ప్రమోట్ చెయ్యనున్నాడని తెలుస్తుంది. దీనికి గానూ ఎన్టీఆర్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాడట. నార్త్ లో ఈ ప్రోడక్ట్ ని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రమోట్ చేస్తుండగా.. ఇక్కడ ఎన్టీఆర్ ప్రమోట్ చేయనుండడం విశేషం. ఇప్పటికే ఈ ప్రాడక్ట్ మంచి లాభాలతో నడుస్తుంది అని అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఎన్టీఆర్, సల్మాన్ లు ప్రమోట్ చేయనుండడంతో దీనికి మరిన్ని లాభాలు వస్తాయనడంలో సందేహం లేదు.

 

Share.