ఖరారు అయిన ఎన్టీఆర్ 28వ మూవీ షూటింగ్ డేట్

అజ్ఞాతవాసి.. ఈ ఒక్క సినిమా త్రివిక్రమ్ పేరుని చాలా వరకు డ్యామేజ్ చేసింది. ఈ చిత్ర ప్రభావం ఎన్టీఆర్ సినిమాపై పడుతుందని ఆయన అభిమానులు ఆందోళన పడ్డారు. అసలు ఈ సినిమాను తారక్ చేస్తారా? క్యాన్సిల్ చేసుకుంటారా? అని సందేహం కూడా వచ్చింది. అయితే ఈ నెగటివ్ వార్తలన్నింటినీ పక్కన పెట్టాలని తారక్ సన్నిహితులు సూచించారు. అజ్ఞాతవాసి వల్ల ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ పై కొంచెం కూడా నమ్మకం తగ్గలేదంట. ఆయన దర్శకత్వంలో నటించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నట్లు వెల్లడించారు. త్రివిక్రమ్ చెప్పిన పాత్రకు తగినట్లుగా తనకు తాను మార్చుకునే పనిలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు.

నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని వారు అజ్ఞాతవాసి రిలీజ్ తర్వాత ఆ చిత్ర కార్యక్రమాలను చూస్తూనే.. ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి మంచి ముహుర్తాన్ని చూస్తున్నారు. ఫిబ్రవరి 14 తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలిసింది. డేట్ ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఖలేజా తర్వాత అపజయం ఎరుగని త్రివిక్రమ్ కి అజ్ఞాతవాసి రూపంలో దెబ్బ తగిలింది. ఈ సారి మరింత బాగా స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని ఎన్టీఆర్ కి మంచి హిట్ ఇవ్వడం గ్యారంటీ అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Share.