‘నో ఫైట్స్.. ఓన్లీ ఫన్’ అంటున్న అనిల్ రావిపూడి

‘పటాస్’ ‘సుప్రీమ్’ ‘రాజా ది గ్రేట్’ చిత్రాలతో మంచి కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. తాజాగా విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ‘ఎఫ్2’ అనే క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా సమాచారం ప్రకారం ‘ఎఫ్2’ చిత్రంలో ఎటువంటి ఫైట్లు ఉండవట. ఫుల్ కామెడీతో.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడంట అనిల్ రావిపూడి. సాధారణంగా దిల్ రాజు నిర్మించే పెద్ద చిత్రాలలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఉండే సినిమాలు చాలా అరుదు. ఒక్క ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మినహా అన్ని పెద్ద సినిమాల్లోనూ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా చూసుకుంటాడు దిల్ రాజు. మరి ఈ విషయంలో నిజమెంతో తెలియాలంటే చిత్ర టీజర్, ట్రైలర్లు వచ్చే వరకూ వేచి చూడాలి.

Share.