విదేశీయుడి కౌగిలిలో నిత్య.. అసలు మ్యాటర్ ఏంటి..?

‘అలా మొదలైంది’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యి తన నటనతో అక్కట్టుకుంది. గ్లామర్ పాత్రలకన్నా కథా బలం ఉన్న చిత్రాలనే ఎంచుకుంటూ ముఖ్యంగా తన పాత్రకి ప్రాధాన్యత ఉండే చిత్రాలనే ఎంచుకుంటూ వచ్చింది. తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవడం వంటివి కూడా నిత్య లో స్పెషాలిటీ. ఇక తన వ్యక్తిగత జీవితంలో ఆమెకి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. అందుకే ‘వన్ నెస్ యూనివర్సిటీ’ అనే ఆధ్యాత్మిక సంస్థతో నిత్యకు గాఢమైన అనుబంధం ఉందని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ప్రపంచ మానవులంతా ఒక్కటే అని బోధించే ‘వన్ నెస్ యూనివర్సిటీ’ సమావేశాలకి… కార్యక్రమాలకి అప్పుడప్పుడు నిత్య హాజరవుతుంటుందట. అలా అక్కడ ఆమె కొందరు విదేశీయులతో పరిచయం ఏర్పడింది. ఆ బంధంతోనే ఓ విదేశీయుడిని కౌగిలించుకొని ఫోటో తీసుకుంది. ఇటీవల ఆ ఫోటోని ట్విట్టర్లో పోస్ట్ చేసి దానికి ఫ్రెండ్స్, లవ్, హ్యాపీనెస్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. నిత్యా ఇలా ఫోటో షేర్ చేయడంతో ఆ వ్యక్తి ఎవరని..? ఆరా తీయడం మొదలుపెట్టారు. నిత్యా లవ్ లో ఉంది అనే కామెంట్స్ కూడా మొదలయ్యిపోయాయి. దీంతో నిత్య వెంటనే స్పందించి ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది. అతడి పేరు ఓలివర్.. నా లిటిల్ బ్రదర్ అంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఓలివర్ ప్రస్తుతం హాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. అతడి వయసు 18కి మించి ఉండవు. కానీ ఆమె అభిమానుల్లో కలకలం రేగడంతో తన లిటిల్ బ్రదర్ అంటూ స్పష్టం చేసింది.

Share.