ఆరడుగుల హీరో పక్కన నిత్య కనిపిస్తుందా..?

నిత్యామీనన్ ను గొప్ప నటిగా ఎంతగా మెచ్చుకుంటారో.. అదే సమయంలో పొట్టి హీరోయిన్ అంటూ గేలి చేస్తుంటారు కూడా. ఈ విషయాన్ని ఆమె కూడా ఒప్పుకుంటుంటుంది. ఒకసారి ప్రెస్ మీట్ లో రాణా పక్కన నిల్చుంటే కనిపించడం లేదని ఆమెను స్టూల్ ఎక్కించి మరీ ఫోటో తీశారు. ఆ సందర్భంలో వేరే హీరోయిన్ అయితే.. సీరియస్ అయిపోయేదేమో కానీ నిత్యమీనన్ కాబట్టి జోవియల్ గా తీసుకుంది. మళ్ళీ ఇప్పుడు కూడా ఆ తరహాలోనే నిత్యామీనన్ ను ఆటపట్టిస్తున్నారు నెటిజన్లు.

అమేజాన్ ప్రైమ్ లో సక్సెస్ ఫుల్ గా నడిచిన ఏకైక వెబ్ సిరీస్ అయిన “బ్రీత్”కి సీక్వెల్ గా రూపొందుతున్న “బ్రీత్ 2″లో అభిషేక్ బచ్చన్ కథానాయకుడిగా నటించనుండగా.. హీరోయిన్ గా నిత్యమీనన్ నటిస్తోంది. అభిషేక్ బచ్చన్ హైట్ ఏమో 6.1, మన నిత్యా ఏమో 5.3. సొ, అతడి పక్కన నిత్య మరీ పొట్టిగా కనిపిస్తుందేమోనని ఆమె అభిమానుల భయం. అయితే.. ఆమె హైట్ ను పెర్ఫార్మెన్స్ తో కవర్ చేసేస్తుంది కాబట్టి ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదు.

Share.