నిన్నుకోరి మూవీ బ్లూపేర్స్ | నాని | నివేత థామస్ | ఆది

నేచురల్ స్టార్ నాని మరోసారి హిట్ అందుకున్నాడు. నిన్నుకోరి సినిమాతో డబల్ హ్యాట్రిక్ సొంతం చేసుకున్నాడు. భలే భలే మగాడివోయ్ సినిమా నుంచి వరుసగా అతను నటించిన సినిమాలు యువతను ఆకట్టుకుంటున్నాయి. అందుకు తగ్గట్టుగా సినిమాకి  సినిమాకి  కలక్షన్స్ పెరుగుతున్నాయి. నాని గత చిత్రం నేను లోకల్ మూడు రోజుల్లో 10 కోట్ల షేర్ వసూలు చేయగా తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘నిన్నుకోరి’ మూడు రోజుల్లో 18 కోట్ల షేర్ రాబట్టింది. జూలై7న రిలీజ్ అయిన ఈ చిత్రం  ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో 25 కోట్ల గ్రాస్ వసూలు చేసి నాని స్థాయిని పెంచింది.

డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో నాని, నివేత థామస్, ఆది పినిశెట్టిల అద్భుత నటనకు ప్రేక్షకులు దాసోహం అంటున్నారు. అమెరికాలో నాని సినిమాని చూసేందుకు తెలుగు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. శుక్ర, శని, ఆది వారాల్లో కేవలం అమెరికాలోనే ఈ మూవీ 1.45 కోట్ల షేర్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.