‘కార్తికేయ 2’ లో ఛాన్స్ కొట్టేసిన స్వాతి..?

చందూ మొండేటి డైరెక్షన్లో నిఖిల్, స్వాతిగా జంటగా వచ్చిన చిత్రం ‘కార్తికేయ’ ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కెరలేదు. ‘స్నేక్ హిప్నటైజేషన్’ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. అంతే కాదు ఈ చిత్రంతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు చందూ మొండేటి. తరువాత వచ్చిన ‘ప్రేమమ్’ చిత్రం కూడా మంచి విజయాన్నందుకున్నాడు. అయితే గతేడాది వచ్చిన ‘సవ్యసాచి’ చిత్రం మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. మొదటి రెండు చిత్రాలకి వచ్చి మంచి పేరు ఈ చిత్రంతో పోయినట్టయ్యింది.

దీంతో ఇప్పుడు ఎలాగైనా ఓ మంచి హిట్టిచ్చి ‘బౌన్స్ బ్యాక్’ అవ్వాలనుకుంటున్నాడు. నాగార్జునతో ఓ చిత్రం చేయాలనుకున్నాడు, కానీ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అలాగే ‘శర్వానంద్’తో కూడా ఓ సినిమా అనుకున్నప్పటికీ.. వర్కౌట్ కాలేదు. దీంతో నిఖిల్ తో ‘కార్తికేయ 2’గా చేయబోతున్నాడని వార్తలొచ్చాయి. ఈ చిత్రంలో కూడా హీరోయిన్ గా కలర్స్ స్వాతి కనిపించబోతుందట. మరో హీరోయిన్ కి కూడా అవకాశం ఉంటుందట. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ స్వాతి రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యినట్టు తెలుస్తుంది. నిఖిల్ కు కూడా ఈ మధ్య సరైన హిట్టు లేదు. ‘కేశవ’ ‘కిరాక్ పార్టీ’ చిత్రాలు సో సో గా ఆడాయి. మరి ఈ హిట్టు సీక్వెల్ తో ముగ్గురు సక్సెస్ అందుకుంటారేమో చూడాలి..!

Share.