పవన్, బాలకృష్ణ సినిమాలపై ట్వీట్ చేసిన నిఖిల్!

హైదరాబాదీ నిఖిల్ ఎటువంటి సినిమా నేపథ్యం లేకపోయినా టాలీవుడ్ లో హీరోగా నిలబడ్డాడు. స్వామిరారా, కార్తికేయ, కేశవ, ఎక్కడికి పోతావు చిన్నవాడా.. వంటి థ్రిల్లర్స్ తో తనకంటూ ఓ గుర్తింపును సాధించుకున్నాడు. ఇప్పుడు కొంచెం స్టైల్ మార్చి “కిర్రాక్ పార్టీ” మూవీ చేస్తున్నాడు. కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాకి ఇది రీమేక్. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం  ఫస్ట్‌లుక్‌ రీసెంట్ గా రిలీజ్ అయి అదరగొట్టింది. ఈ సినిమా షూటింగ్ బ్రేక్ రావడంతో నిఖిల్ అమెరికాలో రెస్ట్ తీసుకుంటున్నాడు. అలాగే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన తెలుగు సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.

న్యూజెర్సీలో “అజ్ఞాత‌వాసి”ని తొలి రోజు చూసి ట్వీట్ చేసాడు. “న్యూజెర్సీ 8కే సినిమాస్‌లో `అజ్ఞాత‌వాసి` చూస్తున్నా. ర‌చ్చ ఎంట్రీ.. సెల‌బ్రేష‌న్ టైమ్‌. ప‌వ‌ర్‌స్టార్ మాస్‌” అని ట్వీట్ చేశాడు. సంక్రాంతి విందుగా వచ్చిన మరో మూవీ జై సింహ. నటసింహ బాలకృష్ణ నటించిన ఈ చిత్రాన్ని నిన్న చూసి తన ఆనందాన్ని ట్వీట్ రూపంలో వెల్లడించాడు. “ఈస్ట్ ఆర్ వెస్ట్ బాల‌య్య బాబు ఈజ్ బెస్ట్‌.. `జైసింహా` ప్రీమియ‌ర్ షో చూస్తున్నాను” అని హాల్ నుంచే ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్స్  పవన్, బాలకృష్ణ అభిమానులను ఆనందింపజేశాయి.nikhil-about-agnyaathavaasi-movie nikhil-about-jai-simha-movie

Share.