సూర్యకాంతం పాత్రలో నటించనున్న నిహారిక

మెగా కుటుంబం నుంచి వచ్చిన తొలి నటి నిహారిక వేసిన తొలి అడుగు కాస్త తడబడింది. ఆమె హీరోయిన్ గా నటించిన ‘ఒక మనసు’ చిత్రం ఆశించినంతగా విజయం సాధించలేదు. దీంతో రెండో చిత్రానికి చాలా కథలు విన్న ఆమె తమిళ కథకు ఒకే చెప్పింది. అరుముగ కుమార్ దర్శకత్వంలో “ఒరు నల్ల నాల్ పాతు సోల్రెన్” అనే మూవీ చేస్తోంది. ఇందులో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌గా, నిహారిక‌ రెండు వైవిధ్యమైన పాత్ర‌ల‌లో కనిపించనుంది. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే తెలుగులో రెండో చిత్రాన్ని కూడా కంప్లీట్ చేసింది.

యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో హ్యాపీ వెడ్డింగ్ అనే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని పూర్తి చేసింది. పల్లెటూరు… ప్రేమ.. పెళ్లి హడావుడి కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్‌ హీరోగా నటించారు. లక్ష్మణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. ఇది అలా కంప్లీట్ అయిందో లేదో.. నిహారిక మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంల “ముద్దపప్పు ఆవకాయ్” వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించిన ప్రణీత్ చెప్పిన కథకు ఓకే చెప్పింది. ఈ సినిమాలో నిహారికని “సూర్యకాంతం” అని పిలుస్తారంట. అందుకే అదే టైటిల్ ని అనుకుంటున్నారు. ఈ మూవీ గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

Share.