అజ్ఞాతవాసికి మెరుగులు దిద్దిన చిత్ర బృందం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో కీలకమైన 25 వ చిత్రం అజ్ఞాతవాసి కోసం బాగా కష్టపడ్డారు. డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తమ కాంబినేషన్లో హ్యాట్రిక్ అందుకోవాలని శ్రమించారు. ఎటువంటి విషయంలోనూ లోపం రాకుండా భారీ బడ్జెట్ తో రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సేషనల్ హిట్ సాదిస్తుందని అందరూ అనుకున్నారు. గత బుధవారం గ్రాండ్ గా రిలీజ్ చేశారు. కానీ అంచనాలు తారుమారయ్యాయి. పవన్ అభిమానులను సైతం ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది.

దీంతో అజ్ఞాతవాసి చిత్ర యూనిట్ తొందరగా మేల్కొంది. నష్టాన్ని తగ్గించడానికి కత్తెరకు పని చెప్పింది. బోర్ కొట్టిన సన్నివేశాలను తొలగించింది. దాదాపు 12 నిముషాల నిడివిగల సినిమాకి కట్ చెప్పింది. అలాగే అంతకంటే మంచి సీన్లను కొత్తగా యాడ్ చేసింది. ప్రస్తుతం చిత్రానికి కలిపిన సీన్స్ నిడివి ఏడు నిముషాలని సమాచారం. ఇందులో వెంకటేష్, పవన్ కాంబో సీన్లు కూడా ఉన్నాయి. గెస్ట్ రోల్లో వెంకీ సినిమా కలక్షన్స్ కి బూస్ట్ ఇవ్వనున్నారు. మెరుగులు దిద్దిన సినిమాని ఈరోజు నుంచి థియేటర్లలో ప్రదర్శించనున్నారు. మరి ఈ మార్పులు సినిమా ఫలితంలో ఎంతమేర మార్పులు తీసుకొస్తాయో చూడాలి.

Share.