చిరంజీవి సింప్లిసిటీని కూడా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

నిన్న సాయంత్రం ఆర్.నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించి, తెరకెక్కించిన “మార్కెట్ లో ప్రజాస్వామ్యం” ఆడియో లాంచ్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు. అక్కడ కార్యక్రమం ప్రారంభమవ్వడానికి ముందు చిరంజీవి అక్కడి పాత్రికేయులతో కలిసి పిచ్చాపాటి మాట్లాడుతూ వారితో కలిసి స్నాక్స్ తిన్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యి.. ఇమ్మీడియట్ గా వైరల్ అయ్యాయి. అందరూ ఆ ఫోటోల్లో చిరంజీవి సింప్లిసిటీని చూస్తే.. కొందరు మాత్రం అందులో సింప్లిసిటీ ఏముంది అని నెగిటివ్ గా మాట్లాడడం మొదలెట్టారు.

netizens-making-shocking-comments-on-mega-star-chiranjeevi2

netizens-making-shocking-comments-on-mega-star-chiranjeevi1

నిజానికి.. ఆర్.నారాయణమూర్తి, దాసరి నారాయణరావు పలుమార్లు మెగా ఫ్యామిలీ గురించి, ఆ కుటుంబ హీరోల గురించి నెగిటివ్ గా మాట్లాడినప్పటికీ.. దాసరి మరణం అనంతరం అవన్నీ పట్టించుకోకుండా పెద్ద మనసుతో ఆ మాటల్ని వదిలేశారు చిరంజీవి. ఇప్పుడు ఆయన స్థానంలో ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తూ నారాయణమూర్తి ఈవెంట్ కోసం ముఖ్య అతిధిగా విచ్చేసి హుందాగా వ్యవహరించినా కూడా కొందరు నెగిటివ్ గా మాట్లాడుతుండడం మెగా అభిమానులను బాగా హర్ట్ చేస్తోంది. తన కెరీర్ మొత్తంలో ఏ ఒక్క నటుడు లేదా టెక్నీషియన్ మీద నెగిటివ్ గా మాట్లాడని చిరంజీవి మీద ఎందుకని నెగిటివిటీ వస్తుందో ఎవరికీ అర్ధం కావడం లేదు.

Share.