తేజు హీరోయిన్ ను బూతులు తిడుతున్న నెటిజన్లు..!

శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘మెంటల్ మదిలో’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమయ్యింది నివేథా పేతురాజ్. ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చినప్పటికీ పెద్దగా ఆడలేదు. కానీ తన నటనకి మాత్రం మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘చిత్రలహరి’… అలాగే శ్రీవిష్ణుతో మరోసారి ‘బ్రోచేవారెవరూ’ వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఈ అమ్మడి పై ట్రోలింగ్ ఓ రేంజ్లో జరుగుతుందట.

ivetha-pethuraj-in-temple1

nivetha-pethuraj-in-temple2

దీనికి ముఖ్యకారాణాన్ని పరిశీలిస్తే.. ” తమిళనాడులోని ప్రసిద్ధి చెందిన మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ పరిరక్షణ కోసం.. అక్కడ ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ మరియు మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధిస్తూ… చెన్నై హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం మరియు గుడి నిర్వాహకులకు కూడా ఈ నియమాలను పాటించాల్సిందిగా కోర్టు వారు పేర్కొన్నారు. ఇప్పుడు డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులు కూడా అక్కడ మొబైల్ ఫోన్లను వాడటం మానేశారు. అయితే నివేదా పేతురాజ్ మాత్రం గుడిలో మొబైల్ వాడుతూ తన స్నేహితురాలితో ఫొటోలు తీసుకుని వాటిని తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను చూసిన కొందరు నెటిజన్లు నివేధా పై విరుచుకుపడ్డారు. ‘అమ్మవారి ఆలయంలో మొబైల్స్ వాడకూడదనే విషయం మీకు తెలీదా..! సెలబ్రెటీ అయినంత మాత్రాన మీరేమీ అమ్మవారి దగ్గర ఎక్కువేమీ కాదు… మీరు కూడా సామాన్య మనుషులే. సామాన్యులకు ఒక న్యాయం.. సెలబ్రెటీలకు ఒక న్యాయం ఉండదు. అసలు గుడి అధికారులు మిమ్మల్ని ఎలా అనుమతించారు’ అంటూ… నెటిజన్స్ నివేథా ఆడేసుకుంటున్నారు. దీని పై ఇంకా ఇంకా నివేథా ఏమీ రియాక్ట్ కాకపోవడం గమనార్హం. పాపం గుడిలో చేసిన తప్పుకి.. ఇప్పుడు ఈ మెగా హీరోయిన్ చాలా విమర్శలు ఎదుర్కొంటుంది.

Share.