ఫ్యామిలీ వెబ్ సిరీస్… నేను మీ కళ్యాణ్

యూట్యూబ్ పరిధి రోజు రోజుకి విస్తరిస్తోంది. స్మార్ట్ ఫోన్ కాలంలో యువత ఒక్కరే కాదు.. ఫ్యామిలీ మొత్తం యూట్యూబ్ లో నచ్చిన షార్ట్ ఫిల్మ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వీక్షకుల సంఖ్య పెరుగుతుండడంతో అత్యంత నాణ్యతతో సినిమాలకు తీసిపోని విధంగా వెబ్ సిరీస్ రూపొందుతున్నాయి. ఈ కేటగిరీల్లో ఎక్కువగా యువతే టార్గెట్ ఉంటారు. తొలిసారిగా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసి ఎంజాయ్ చేసే వెబ్ సిరీస్ ని “చాయ్ బిస్కెట్” వారు తీసుకొచ్చారు. అదే “నేను మీ కళ్యాణ్”. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ తొలి ఎపిసోడ్ నిన్న రిలీజ్ అయి అభినందనలు అందుకుంటోంది.

చక్కని ఫ్యామిలీ, కుటుంబసభ్యుల మధ్య అనుబంధాలు.. స్నేహితుల సరదాలు, మధ్యలో ప్రేమ .. అన్ని ఎమోషన్స్ ని మేళవించి ఈ సిరీస్ ని రూపొందించినట్లు తొలి ఎపిసోడ్ స్పష్టం చేసింది. ఆర్టిస్టుల నటనకు తోడు.. కార్తీక్ కుమార్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ మనకి థియేటర్లో సినిమా చూస్తున్న అనుభూతిని ఇస్తుంది. కథ.. సన్నివేశాలు ఇక్కడే చదివేస్తే మజా ఏముంటుంది. అందుకే మిస్ కాకుండా చూసి ఎంజాయ్ చేయండి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.