నవాజుద్దీన్ సిద్ధిఖీ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన ‘పెట్టా’ టీం

తాజాగా వచ్చిన ‘2.0’ కలెక్షన్ల జోరు ఇంకా తగ్గక ముందే మరో చిత్రంతో వచ్చేస్తున్నాడు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో ‘రజనీ 165 వ’ చిత్రంగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పెట్టా’. అనిరుథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్ధ నిర్మిస్తుంది. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

nawazuddin-siddiqui-as-singaar-singh-in-rajinikanths-petta1-min

ఈ చిత్రంలో త్రిష, సిమ్రాన్ హీరోయిన్లుగా నటిస్తుండగా విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా నవాజుద్దీన్ సిద్ధిఖీ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో నవాజుద్దిన్ ‘సింగార్ సింగ్’ అనే పాత్రలో కనిపించబోతున్నాడట. తమిళ్ లో ‘పెట్టా’ చిత్రాన్ని 2019 సంక్రాంతి కానుకగా విడుదల చేయనుండగా…. తెలుగులో ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారనే దాని పై ఇంకా ఎటువంటి సమాచారం లేదు.

Share.