బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయిన ‘పెన్సిల్ గ్యాంగ్’..!

అదేంటో కానీ ఒక్కోసారి ఎంత మంచి టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం రావు. ఒక్కో సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు అదిరిపోతుంటాయి. రిలీజ్ టైమింగ్ బ్యాడో.. ఏమో కానీ… ఈ మథ్య విడుదలైన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రానికి మంచి టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం సరిగ్గా రాబట్టలేకపోతుంది. వీకెండ్ వరకూ మంచి కలెక్షన్లను రాబట్టిన ‘నానీస్ గ్యాంగ్ లీడర్’.. ఆ తరువాత మాత్రం ఆ జోరు చూపించలేకపోయిందనే చెప్పాలి.

ఇక ఈ చిత్రం క్లోజింగ్ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 6.62 cr
సీడెడ్ 1.60 cr
ఉత్తరాంధ్ర 2.18 cr
ఈస్ట్ 1.33 cr
వెస్ట్ 0.98 cr
కృష్ణా 1.24 cr
గుంటూరు 1.30 cr
నెల్లూరు 0.55 cr
ఏపీ + తెలంగాణ 15.80 cr
రెస్ట్ అఫ్ ఇండియా 1.65 cr
ఓవర్సీస్ 3.69 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 21.14 cr (షేర్)

‘నానీస్ గ్యాంగ్ లీడర్‘ చిత్రానికి 28 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం ఫైనల్ గా 21.14 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అంటే డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల వరకూ నష్టపోయినట్టు తెలుస్తుంది. అయితే తరువాత ‘గద్దలకొండ గణేష్’ చిత్రం రావడం మాస్ జనాలు ఎక్కువ ఆ చిత్రానికే క్యూ కట్టారు. దీంతో ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ చిత్రం మాస్ జనాలు ఈ చిత్రం కోసం ఎగపడ్డారు. దీంతో ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ కలెక్షన్లు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది ‘జెర్సీ’ తో మంచి హిట్టందుకున్న నానికి ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ తో మరో ప్లాప్ పడినట్టయ్యింది.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.