మజిలీ కలెక్షన్స్ ను క్రాస్ చేయలేకపోతున్న జెర్సీ

క్రికెట్ నేపధ్యంలో తెరకెక్కిన రెండు చిత్రాలు “మజిలీ, జెర్సీ”లు నెల రోజుల గ్యాప్ లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల మీద మొదట అంచనాలు లేకపోయినా.. విడుదలైన తర్వాత మాత్రం ప్రేక్షకులు మరియు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అయితే.. నాగచైతన్య-సమంతల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన “మజిలీ”కి వచ్చిన కలెక్షన్స్ “జెర్సీ”కి రాకపోవడం గమనార్హం. “మజిలీ” మొదటి వారాంతంలో 17 కోట్ల షేర్ ను వసూలు చేయగా.. “జెర్సీ” మాత్రం 15 కోట్ల దగ్గరే ఆగిపోయింది. ఓవర్సీస్ లో “జెర్సీ” పైచేయి సాధించి 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసినప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం “మజిలీ” రికార్డ్స్ ను చేరువవ్వడం కష్టమనే విశ్లేషణలు వెల్లడవుతున్నాయి.

ఒకరకంగా చెప్పాలంటే “జెర్సీ” చిత్రానికి “మజిలీ” కంటే మంచి రివ్యూలు వచ్చాయి. ఫస్ట్ రోజు వచ్చిన టాక్ & రివ్యూస్ కి సినిమా కచ్చితంగా 50 కోట్లు వసూలు చేయడం ఖాయం అనుకున్నారు. కానీ.. “మజిలీ” మూడో వారంలోనూ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుండగా.. “జెర్సీ” మాత్రం నత్తనడకలా సాగుతుండడం గమనార్హం.

Share.