ఇంద్రగంటి మల్టీ స్టారర్ కు ముహూర్తం ఫిక్స్..?

గతేడాది ‘సమ్మోహనం’ చిత్రంతో డీసెంట్ హిట్టందుకున్నాడు డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఈ చిత్రం తరువాత నాని, సుధీర్ బాబులతో ఓ క్రేజీ మల్టీస్టారర్ రూపొందిస్తున్నట్టు గత కొంతకాలంగా టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ప్రారంభానికి ముహూర్తం ఫిక్సయ్యింది సమాచారం. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 26 న లాంఛనంగా మొదలుకానుందట. థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా నాని నెగెటివ్ పాత్రలో కనిపించబోతున్నాడట.

ఇంద్రగంటి మోహన కృష్ణతో నానికి ఇది మూడవ చిత్రం కాగా.. మరో హీరో సుధీర్ బాబు కి రెండో చిత్రం కావడం విశేషం. ఇక ఈ చిత్రంలో నాని సరసన నివేధా థామస్ హీరోయిన్ గా నటిస్తుండగా సుధీర్ బాబుతో అదితి రావు హైదరి జతకడుతుంది. ఇక ఈ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి డిసెంబర్ కి విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని నమోదుచేస్తుందో చూడాలి.

Share.