మహేష్ తనయుడు ఈసారి హీరోగానే వస్తాడు..!

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటిస్తున్న రోజుల్లో మొదట తన పెద్ద కొడుకు రమేష్ బాబునే హీరోని చేద్దామని భావించారట. అయితే అప్పటికే కృష్ణ చిత్రాలలో బాలనటుడిగా మహేష్ బాబు నటించినప్పటికీ హీరోని చేయాలనే ఆలోచన అప్పట్లో కృష్ణ గారికి లేదంట. అయితే ఊహించని విధంగా రమేష్ హీరోగా రాణించకపోవడంతో.. నిర్మాణ రంగానికి మాత్రమే అంకితమయ్యారు. ఈ క్రమంలో మహేష్ ని రంగంలోకి దించగా.. చాలా కష్టపడి ఎదిగి ఇప్పుడు స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. అయితే మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ ఇలా ప్రతీ ఫ్యామిలిలో ఇద్దరేసి మందికి పైగా హీరోలు ఉండగా… ఘట్టమనేని ఫ్యామిలీని మాత్రం మహేష్ ఒక్కడే లాక్కొస్తున్నాడు.

అయితే ఘట్టమనేని కుటుంబంలో మూడో తరం వారసుడు సిల్వ‌ర్‌ స్క్రీన్‌ పై కి వచ్చిన సంగతి తెలిసిందే. సూప‌ర్‌స్టార్ కృష్ణ మ‌న‌వ‌డు, మ‌హేష్‌బాబు తనయుడైన గౌత‌మ్‌ `వన్ నేనొక్కడినే`లో చిన్నప్పటి మహేష్ బాబు గా కనిపించి మెప్పించాడు. అప్పటినుండీ మళ్ళీ గౌతమ్ ఎప్పుడు నటిస్తాడా… అని ఘట్టమనేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ కొడుకు ఈసారి హీరోగా రావడం దాదాపు ఖాయమే అన్నట్టు కనిపిస్తుంది.

ఇటీవల మహేష్ – నమ్రత ల పెళ్ళి రోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ మళ్ళీ ఎప్పుడు నటిస్తాడని నమ్రతను అడగ్గా… “ఒకవేళ హీరో అయినప్పుడు“ అంటూ నమ్రత జవాబిచ్చారు. దీనితో పాటూ.. ‘ఇప్పుడే గౌతమ్ హీరో అవుతాడని చెప్పడం తొందరపాటు అవుతుందనీ… గౌత‌మ్‌ని తాము హీరోగా చూడాల‌నుకుంటున్నామనీ… గౌత‌మ్ కూడా హీరో అవుతాన‌ని అంటున్నాడ‌నీ…. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలని నమ్రత చెప్పడంతో ఘట్టమనేని అభిమానుల్లో ఆసక్తి మొదలయ్యింది. ఏవిధంగా అయితే మహేష్ బాల నటుడిగా.. తన తండ్రి కృష్ణ సినిమాల్లో నటించి హీరో అయ్యాడో… అలాగే, గౌతమ్ కూడా తండ్రి మహేష్ సినిమాలో బాల నటుడిగా కనిపించి హీరో అవ్వడానికి సిద్ధమవుతున్నాడని స్పష్టం అవుతుంది. ఇక మహేష్ ‘మహర్షి’ చిత్రం ఏప్రిల్ 25 న విడుదల కాబోతుంది.

Share.