నీహారిక కోసం అబ్బాయిని వెతుకుతున్న నాగబాబు

ఈమధ్య నాగబాబు అనే పేరే పెద్ద సెన్సేషన్ అయిపోయింది. ఆల్రెడీ ఒక యూట్యూబ్ చానల్ ఓపెన్ చేసి అందులో రాజకీయపరంగా సెటైరికల్ వీడియోస్ చేస్తే విశేషంగా నవ్విస్తున్న నాగబాబు ఇటీవల ఒక యూట్యూబ్ చానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. రెగ్యులర్ ఇంటర్వ్యూల్లాగే సాగిన ఈ ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు నాగబాబు ఇచ్చిన సమాధానం షాక్ కు గురి చేసింది. అందరు అడిగినట్లుగానే నాగబాబును ఆయన కుమార్తె నీహారికకు పెళ్లి ఎప్పుడు అని అడగ్గా.. ఆల్రెడీ సంబంధాలు చూడడం మొదలెట్టానని ఈ ఏడాది లోపు వరుడ్ని ఫైనల్ చేస్తానని చెప్పడమే కాక.. ఒకవేళ మా కాపు కులంలో దొరక్కపోతే.. బయట కులం లోని కుర్రాడినైనా వెతికి పెళ్లి చేస్తానని నాగబాబు చెప్పడం అందర్నీ అవాక్కయ్యేలా చేసింది.

ఆయన కుమార్తెను బయట కులం వారికి ఇచ్చి పెళ్లి చేస్తాడా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన ఇలా తన కులం పట్టింపులు లేవని కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పడం మాత్రం చర్చనీయాంశం అయ్యింది. అలాగే.. తన కుమార్తెను పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కాకపోయినా వెబ్ సిరీస్ చేయమని ప్రోత్సహిస్తున్నాడట నాగబాబు. ఈ ఒప్పందం మొత్తం మూడేళ్ళ క్రితమే అయ్యిందట. ఇటీవలే వెంకటేష్ కూడా తన కుమార్తెకు ప్రేమించిన వ్యక్తినిచ్చి పెళ్లి నిశ్చయించడం.. ఇదివరకు మంచు మనోజ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఇండస్ట్రీలోని క్యాస్ట్ గోల భవిష్యత్ లో తగ్గే అవకాశం కనిపిస్తోంది.

Share.