నాగ చైతన్య, సమంత భార్య భర్తలు కాబోయేది ఎప్పుడంటే ?

కింగ్ నాగార్జున కోడలా అని సమంతని పిలిచినప్పుడే అక్కినేని అభిమానుల్లో ఆనందం వెళ్లి వెరిసింది. ఇప్పుడు నాగచైతన్య, సమంతల పెళ్లి ముహూర్తం ఖరారైన విషయం మరింత సంతోషాన్ని అందించింది. ఈ ప్రేమ పక్షులు పెద్దల సమక్షంలో జనవరి 29న నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి పీటలపై కూర్చునేందుకు వారిద్దరూ కొంత గడువు కోరడంతో అప్పుడు ముహూర్తం ఫిక్స్ చేయలేదు. తాజాగా చైతూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కల్యాణ వేడుకకు పనులు మొదలెట్టారు. అక్టోబర్ ఆరవ తేదీ సమంత, నాగచైతన్య భార్య భర్తలు కానున్నట్లు సమాచారం. ఈ వివాహాన్ని గోవాలో వేడుకగా నిర్వహించనున్నట్లు తెలిసింది.

మొదట హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించనున్నారు. అనంతరం చర్చిలో జీసస్ ఎదుట ఉంగరాలు కూడా మార్చుకోనున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య నటించిన “రారండోయ్ వేడుక చూద్దాం ” మూవీ ఈనెల 26 న రిలీజ్ కాబోతోంది. దీని తర్వాత చైతూ మరో థ్రిల్లర్ మూవీ చేయనున్నారు. సమంత రామ్ చరణ్ సరసన నటిస్తోంది. రాజు గారి గదిలోనూ మెరవనుంది. ఈ ప్రాజక్టులను ఆగస్టు నాటికీ కంప్లీట్ చేసి వధూ వరులుగా ముస్తాబుకానున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.