నాకే నే నచ్చేస్తున్నా వీడియో సాంగ్ టీజర్ | రాజా ది గ్రేట్ | రవి తేజ, మెహ్రీన్ పిర్జాదా

‘బెంగాల్ టైగర్’ తర్వాత సంవత్సరం పైగా గ్యాప్ తీసుకుని మాస్ మహారాజా రవితేజ చేసిన చిత్రం ‘రాజా ది గ్రేట్’. లుక్ దగ్గర్నుండి కథ వరకు అన్నిటిలోను కొత్తదనం పాటిస్తూ చేస్తున్న చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నారు. ట్రైలర్ తో మంచి అంచనాల్ని క్రియేట్ చేసిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుండగా చిత్ర యూనిట్ ఆడియోను రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. 4వ తేదీన మొత్తం ఆడియోను రిలీజ్ చేయనున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ ప్రిజాద హీరోయిన్ గా నటిస్తుండగా రవి తేజ చూపులేని వ్యక్తిగా నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి గత చిత్రాల తరహాలోనే ఇది కూడా ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండనుంది. ఈ చిత్రంతో రవితేజ పూర్వపు వైభవాన్ని తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నారు.

Share.