‘నా పేరు సూర్య’ ఫ‌స్ట్ ఇంపాక్ట్ | అల్లు అర్జున్‌, అను ఇమ్మాన్యుయేల్

ఫస్ట్ ఇంపాక్ట్ అంటూ ఓ టీజర్ రిలీజ్ రిలీజ్ చేసేడు బన్నీ. నా పేరు సూర్య సినిమాకు సంబంధించి న్యూ ఇయర్ కానుకగా ఈ టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ పై ఫ్యాన్స్ కు ఇప్పటికే చాలా అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే కంప్లీట్ యాక్షన్ థీమ్ తో టీజర్ కట్ చేశారు. వక్కంతం వంశీ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా 60శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. జనవరి 4 నుంచి మరో షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఓ సందిగ్దత తొలిగింది. మొన్నటివరకు రజనీకాంత్ నటించిన 2.0 సినిమాతో పోటీ ఉంటుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ రజనీకాంత్ సినిమా 2 వారాల ముందే ఏప్రిల్ 14న థియేటర్లలోకి వచ్చేస్తుంది. సో.. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏప్రిల్ 27న నా పేరు సూర్య సినిమా థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

Share.