కోచ్ పాత్రలో కనిపించబోతున్న విజయ్

తాజాగా మురుగదాస్ డైరెక్షన్లో వచ్చిన ‘సర్కార్’ చిత్రంతో భారీ హిట్ సాధించాడు ఇళయ దళపతి విజయ్. మొదట ‘సర్కార్’ చిత్రానికి డివైడ్ టాక్ వచినప్పకీ ‘విజయ్ – మురుగదాస్’ ల హ్యాట్రిక్ కంబినేషన్ పై ఉన్న క్రేజ్ తో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇటీవలే తన నెక్స్ట్ సినిమాని కూడా విజయ్ లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే.

విజయ్ కు ‘తేరి’ ‘మెర్సెల్’ వంటి హిట్స్ ఇచ్చిన అట్లీ దర్శకత్వంలో తన 63 వ చిత్రాన్ని అనౌన్స్ చేసాడు విజయ్. ఇటీవల అట్లీ చెప్పిన పూర్తి స్క్రిప్ట్ విన్న విజయ్ కొన్ని మార్పులు చెప్పగా దర్శకుడు అట్లీ కుమార్ వాటిని మెరుగుపరిచే పనుల్లో బిజీగా ఉన్నాడట. సంక్రాంతికి ఈ చిత్రాన్ని లాంచ్ చేయబోతున్నట్టు సమాచారం. ఇది కూడా విజయ్ – అట్లీ కు హ్యాట్రిక్ కాంబినేషన్ కావడం విశేషం. క్రీడా రంగానికి చెందిన ఈ కధలో విజయ్ కోచ్ పాత్రలో కనిపించబోతున్నాడట.

Share.