మహేష్ అభిమానులకి మరింత కిక్ ఇచ్చేలా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘మహర్షి’ చిత్రం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి యూపర్ టూర్ కు వెళ్ళాడు మహేష్. ఇక పెద్దగా గ్యాప్ తీసుకోకుండా తన 26 వ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు మహేష్. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కనుందన్న సంగతి తెలిసిందే. ఓ పెద్ద స్టార్ హీరోతో అదీ 100 కోట్ల మార్కెట్ ఉన్న హీరోని అనిల్ డైరెక్ట్ చేయడం ఇదే మొదటి సారి. ఇక ఈ చిత్రం లాంచింగ్ కు డేట్ ఫిక్సయిందట.

అందుతున్న సమాచారం ప్రకారం మే 31 న… అంటే సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజున ఈ చిత్రం లాంచ్ కాబోతుందట. ఇక వచ్చేనెల అంటే జూన్ 26 న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందట. 2020 సంక్రాంతి టార్గెట్ గా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని పక్కా ప్లాన్ తో ఉన్నారు చిత్ర యూనిట్. పక్కా మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తుంది. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మొదట దిల్ రాజు కూడా ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరిస్తాడని వార్తలొచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుండీ దిల్ రాజు తప్పుకున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక 2019 సంక్రాంతికి ‘ఎఫ్2’ చిత్రంతో బాక్సాఫీస్ ను షాక్ చేసిన అనిల్ రావిపూడి.. 2020 లో మహేష్ చిత్రంతో ఎలాంటి ఫలితాన్నిస్తాడో చూడాలి..! ఒకవేళ ఈ చిత్రం కూడా ‘ఒక్కడు’ తరహా రేంజ్లో ఉంటే మహేష్ కు హ్యాట్రిక్ అవ్వడం ఖాయం.

Share.