ఆకట్టుకున్న మిస్టర్ మజ్ను ఫస్ట్ లుక్

అఖిల్, హలో చిత్రాల తర్వాత అఖిల్ చేస్తున్న చిత్రం మిస్టర్ మజ్ను. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రస్తుతం లండన్లో షూటింగ్ జరుపుకుంటోంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ అంటే ఫోటో రూపంలో రిలీజ్ చేస్తారు. అఖిల్ మాత్రం వీడియో రూపంలో విడుదల చేశారు. దేవదాస్ మనవడో.. మన్మధుని వారసుడో అంటూ సాంగ్స్ తో స్టార్ అయిన ఈ వీడియో చాలా అందంగా ఉంది.

“ఎక్స్ క్యూజ్ మీ మిస్ .. ఏమిటో ఇంగ్లిష్ భాష దేన్నీ అయితే మిస్ చేయకూడదో.. దాన్నే మిస్ అన్నారు” అంటూ డైలాగ్ తో అఖిల్ ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో అఖిల్ ప్లే బాయ్ పాత్రను పోషిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా అతని లుక్ చాలా స్టైల్ గా ఉంది. “బాయ్స్ విల్ బి బాయ్స్” అంటూ ట్యాగ్ లైన్ జోడించడం కూడా కొత్తగా ఉంది. బీవీఎన్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అక్కినేని నాగార్జున కి కలిసి వచ్చే నెల అయిన డిసెంబర్ లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. తొలి ప్రేమ సినిమా తర్వాత వెంకీ అట్లూరి చేస్తున్న సినిమా కావడంతో మిస్టర్ మజ్ను పై భారీ అంచనాలున్నాయి.

Share.