మహేష్ హీరోకాక ముందు చేసిన సినిమాలు!

రాజకుమారుడు సినిమాతో మహేష్ బాబు హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ చిత్రం కంటే ముందు బాలనటుడిగా నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. చిన్న వయసులోనే సాహసంతో కూడిన యాక్షన్ సన్నివేశాలను డూప్ లేకుండా చేసి తండ్రికి తగ్గ కొడుకుగా నిరూపించుకున్నారు. ఈ రోజు (ఆగస్టు 09 ) మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. బాలనటుడిగా మహేష్ నటించిన సినిమాలపై ఫోకస్…

01 . నీడ1-needaదర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన నీడలో తొలిసారి మహేష్ బాబు నటించారు. అప్పుడు అతని వయసు నాలుగేళ్లు. హీరోగా ఎప్పుడూ చొక్కా విప్పని సూపర్ స్టార్ తొలి చిత్రంలో చొక్కా లేకుండా నటించడం విశేషం.

02 . పోరాటం 2-poratamకొన్నేళ్లు గ్యాప్ తర్వాత మహేష్ తండ్రి కృష్ణ సినిమా “పోరాటం”లో నటించారు. తండ్రి, కొడుకులు అన్నదమ్ములుగా నటించి మెప్పించారు. మహేష్ కళ్ళజోడు పెట్టి చాలా అందంగా కనిపించడంతో పాటు చక్కగా డైలాగులు చెప్పి శెభాష్ అనిపించుకున్నారు.

03 .శంఖారావం3-shakharavamసూపర్ స్టార్ తెరకెక్కించిన సినిమాల్లో శంఖారావం ఒకటి. 1987 లో వచ్చిన ఈ సినిమాలో కృష్ణ, మహేష్ లు తండ్రి కొడుకులుగా నటించారు. అభిమానులను అలరించారు.

04 . బజారు రౌడీ 4-bazaar-rowdyకోదండ రామిరెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బజారు రౌడీ లో కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా నటించారు. ఇందులో ఓ ప్రత్యేక పాత్రలో మహేష్ నటించి నవ్వులు పూయించారు.

05 . ముగ్గురు కొడుకులు 5-mugguru-kodukuluకృష్ణ తన ఇద్దరు కొడుకులు రమేష్ బాబు, మహేష్ బాబు తో కలిసి చేసిన సినిమా ముగ్గురు కొడుకులు. ఇందులో ముగ్గురూ పోటాపోటీగా నటించి సినిమాని సూపర్ హిట్ చేశారు.

06 . గూడాచారి 117 6-gudachari-117కృష్ణ గూడాచారి 116 గా సూపర్ హిట్ అందుకున్నారు. కొన్నేళ్ల తర్వాత గూడాచారి 117 సినిమా చేశారు. ఇందులో మహేష్ నటనతో పాటు డ్యాన్స్ తో అదరగొట్టారు.

07 . కొడుకులు దిద్దిన కాపురం 7-koduku-diddina-kapuramచిన్నప్పుడే మహేష్ డ్యూయల్ రోల్ చేసి అలరించిన సినిమా కొడుకులు దిద్దిన కాపురం. కృష్ణ, విజయ శాంతి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో కృష్ణ కొడుకులుగా అద్భుతంగా నటించారు.

08 . బాల చంద్రుడు 8-bala-chandruduమీసాలు కూడా రాణి వయసులోమహేష్ టైటిల్ రోల్ పోషించారు. బాల చంద్రుడు సినిమాలో మహేష్ ఫుల్ లెన్త్ రోల్ చేసి ఇక హీరోగా ఎంట్రీ మాత్రమే మిగిలి ఉందని చెప్పారు.

09 . అన్న – తమ్ముడు 9-anna-tammuduమహేష్ బాబు బాలనటుడిగా చివరిగా చేసిన చిత్రం అన్న – తమ్ముడు. ఇందులో అన్నగా కృష్ణ నటించగా తమ్ముడి పాత్రను మహేష్ బాబు పోషించారు. 1990 లో వచ్చిన ఈ చిత్రంలో ఒమేగా స్టార్ గా పరిచయం చేసుకున్న మహేష్ .. రాజకుమారుడితో ప్రిన్స్ గా అవతారమెత్తారు.

Share.